హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుందర్‌సింగ్ కాలనీలో సుజాతమ్మ పర్యటన

NDL: డోన్ 20వ వార్డు సుందర్‌సింగ్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మంగళవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వార్డులో చేపట్టనున్న సీసీ రోడ్లు, అమృత్‌ 2.0 తాగునీటి వసతులు, డ్రైనేజీ పనుల వివరాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.