KDP: ఖాజీపేట మండలం పత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన శుద్ధినీటి కేంద్రం ఏళ్లుగా మూతపడింది. దీంతో ప్లాంట్‌లోని విలువైన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. తాగునీటి కోసం బయట నుంచి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో ఆర్థిక భారం పడుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పత్తూరులో మూతపడిన శుద్ధినీటి కేంద్రం..!


