హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

PLD: నరసరావుపేట స్టేషన్‌ రోడ్డులోని కాసు బ్రహ్మానందరెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.