హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్‌

SKLM: ఆమదాలవలస పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవి మంగళవారం ఉదయం పరిశీలించారు. క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచిపై ఆరా తీశారు. పేదలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. క్యాంటీన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.