హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్మీ చీఫ్‌తో US కమాండింగ్ జనరల్ భేటీ

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్‌తో US ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ జోయెల్ బి.వోవెల్ భేటీ అయ్యారు. ఇండో-పసిఫిక్ భద్రతా పరిస్థితులు, ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతంపై ఇరువురు చర్చించారు. ఉమ్మడి సైనిక విన్యాసాల ద్వారా సహకారం పెంచుకోవడంపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన 'యుద్ధ అభ్యాస్' విజయవంతం కావడం ఇరుదేశాల బలమైన సైనిక బంధానికి నిదర్శనమన్నారు.