దేశంలో 29 ఏళ్లకే యువత బట్టతల బారిన పడుతున్నారని ఓ తాజా అధ్యయనం తేల్చింది. 5.61 లక్షల మందిపై చేసిన సర్వేలో, ఉత్తరాదితో పోలిస్తే తెలంగాణ, ఏపీ, తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్య తీవ్రంగా ఉందని వెల్లడైంది. మారుతున్న జీవనశైలి, తీవ్ర మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పోషకాల లోపమే చిన్న వయసులోనే వెంట్రుకలు రాలిపోవడానికి ప్రధాన కారణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వార్తలు
బట్టతల.. దక్షిణాది యువతకే ముప్పు ఎక్కువ!


