హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా 'పారాక్వాట్' గడ్డిమందు బ్యాన్

మనుషులు, జంతువుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్న గడ్డిమందు 'పారాక్వాట్‌'ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూలై 10న విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు సలహాలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంది. ఈ రసాయనాన్ని నిషేధించిన దాదాపు 70 దేశాల సరసన భారత్ చేరింది.