హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 111 అర్జీలు

MDCL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 111 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి, DRO మాలతి వాటిని స్వీకరించారు. తార్నాకలోని మల్కాజ్‌గిరి నగర పాలక సంస్థలో జరిగిన ప్రజావాణిలో 24 అర్జీలను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకరించారు. వాటిలో ఇంజనీరింగ్ 5, టౌన్ ప్లానింగ్ 15, ఇతర శాఖలకు 4 వినతులు ఉన్నాయి.