హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కేంద్రాలపై కలెక్టర్ సమీక్ష

SRD: రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. అందులో 196 కేంద్రాలు దొడ్డు రకానికి, 31 కేంద్రాలు సన్న రకానికి కేటాయించామన్నారు. ఈ సీజన్‌లో దాదాపు 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశముందని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులన్నీ వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.