హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐల బదిలీ.. ఐజీ ఉత్తర్వులు..!

ఖమ్మం జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రామకృష్ణ టూటౌన్‌కు, కరుణాకర్ రఘునాథపాలేనికి, ఉస్మాన్ షరీఫ్ మహిళా పీఎస్‌కు బదిలీ అవ్వగా.మహిళా పీఎస్ సీఐ చిట్టిబాబు త్రీటౌన్‌కు, శివప్రసాద్ ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు. సీఐలు భానుప్రకాష్,బెల్లం సత్యనారాయణ, బాలకృష్ణలను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.