BHPL: టేకుమట్ల మండలంలోని అంకుశాపూర్, వెలిశాల గ్రామాల్లో సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అంకుశాపూర్‌కు చెందిన వలస భిక్షపతి, వెలిశాలకు చెందిన కోడూరి చంద్రయ్య వద్ద చెరో 5 లీటర్ల గుడుంబా లభ్యమైంది. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై జి. అమూల్య తెలిపారు. గుడుంబా తయారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ
10 లీటర్ల గుడుంబా స్వాధీనం.. ఇద్దరిపై కేసు


