హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలిక సదుపాయాల కొరతతో ప్రజల అవస్థలు

VKB: పరిగి పంచాయతీ నుంచి పురపాలికగా మారినా పట్టణంలో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోంది. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండగా, మురుగు కాల్వలు శిథిలావస్థకు చేరాయి. పారిశుద్ధ్య వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు మంజూరవుతున్నా పనుల్లో జాప్యం అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.