హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెండు రోజులు నీటి సరఫరా బంద్'

BHNG: జిల్లాలోని పలు మండలాల్లో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గోదావరి తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. తుర్కపల్లి జీఎల్‌బీఆర్ వద్ద 600 మి. మీ. గేట్ వాల్వ్ మరమ్మతుల కారణంగా 700 మి. మీ. డీఐ పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ సోమవారం సాయంత్రం తెలిపారు. ప్రజలు ముందస్తుగా తాగునీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.