హైదరాబాద్: 28°C
తెలంగాణ

యంగ్ ఇండియా’ స్కూళ్ల పనులపై భట్టి సమీక్ష..!

KMM: 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులపై సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 చోట్ల ప్రారంభమైన పనులను గడువులోగా పూర్తి చేయాలని, సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశించారు. నాణ్యత పరిశీలనకు వచ్చే నెల రెండో వారం నుంచి తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని వెల్లడించారు.