MHBD: వినాయక నిమజ్జనం కోసం వచ్చిన చిన్నగూడూరు మండలం జయ్యారం చెందిన ఎల్ది నరేశ్ (31) ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వినాయక నిమజ్జనం అనంతరం బైక్ పై మహబూబాబాద్ వైపు వెళ్తుండగా కురవి మండలం గుండ్రాతిమడుగు వద్ద వరి పొలంలో పడిపోయాడు. మూడు రోజుల తర్వాత సోమవారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదవశాత్తు యువకుడి మృతి


