హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. సిలిండర్ పేలి నలుగురు మృతి

UP మాల్వాన్‌లో సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. చుట్టుపక్కల ఉన్న మరికొన్ని ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.