హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ

ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరగనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, సీఎంలు హాజరయ్యే ఈ భేటీలో SIR ప్రక్రియ, ఓట్ల చోరీపై చర్చించి, వ్యతిరేక తీర్మానం చేయనున్నారు. ఈసీ తీరుపై దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టడంతో పాటు, రాబోయే ఇండియా కూటమి భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపైనా అగ్రనేతలు కీలక చర్చలు జరపనున్నారు.