హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమాన్‌ ఆలయానికి జవాన్‌ తొలి జీతం విరాళం

NRML: తానూర్ మండలం బొంద్రేట్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గణేష్ పాటిల్ తన తొలి ఆర్మీ జీతం నుంచి రూ.21వేలను హనుమాన్ మందిర నిర్మాణానికి విరాళంగా అందించారు. సోమవారం తన తాతయ్య అవధూత పాటిల్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. జవాన్ గణేష్ పాటిల్‌ను సర్పంచ్ రవీంద్ర పాటిల్ సిందే, వార్డు సభ్యుడు భోజారం పటేల్, నాగేందర్ పటేల్ అభినందించారు.