హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి కూల్చివేతలపై డీకే అరుణ ఆగ్రహం

MBNR: జడ్చర్ల ఎంబీ మెడికల్ ఆసుపత్రి, నివాస ఆస్తుల కూల్చివేతలపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అర్ధరాత్రి బుల్డోజర్లతో ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడి మహిళా వైద్యురాలు డాక్టర్ అనురాధను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. సమస్యలుంటే చట్టపరంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.