హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ మహిళ మృతి

JN: జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లుకు చెందిన పసునూటి లక్ష్మి (50) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. భర్త నర్సింహారెడ్డి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఒంటరితనం భరించలేక ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్సై రామారావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.