హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్టోబర్ 20 నాటికి యూనిఫారాల తయారీ పూర్తి కావాలి'

ADB: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల యూనిఫారాల తయారీని అక్టోబర్ 20 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. వచ్చే ఏడాదికి కావాల్సిన యూనిఫారాలను మే 30 లోగా అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లను విద్యార్థుల చదువుకు సమర్థంగా ఉపయోగపడేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.