KNR: కరీంనగర్ రూరల్ ముగ్దుంపూర్ శివారులో 1.140 కిలోల గంజాయిని తరలిస్తున్న యువకుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్న బుర్ర వంశీ (24)పై నిఘా పెట్టి పట్టుకున్నారు. గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిపై గతంలోనూ గంజాయి కేసులు, హిస్టరీ షీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
గంజాయి తరలిస్తుండగా యువకుడి పట్టివేత


