హైదరాబాద్: 28°C
తెలంగాణ

PHC పరిసరాల్లో కుక్కల సంచారం.. ఆందోళనలో రోగులు

ASF: సిర్పూర్ (U) మండల PHC పరిసరాల్లో కుక్కల మంద సంచరిస్తుండటంతో ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు ఆసుపత్రికి రావాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.