హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రూ.213.59 కోట్లతో ఎయిర్‌పోర్టు పనులు'

WGL: మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో ముందడుగు పడింది. నూతన డొమెస్టిక్‌ టెర్మినల్‌, ATC టవర్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఫైర్‌స్టేషన్‌ తదితర నిర్మాణాలకు ఏఏఐ టెండర్లు పిలిచింది. పనులను 18నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. ఏఏఐ అధికారులు టెండర్‌దారులతో కలిసి ఎయిర్‌పోర్టును పరిశీలించి ప్రీ-బిడ్‌ సమావేశం అయ్యారు.