హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం ?

NLG: నల్లగొండ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబురావు అనే ఖైదీ సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. జైలు ప్రాంగణంలోనే పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు అతడిని అత్యవసర చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.