హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ పాఠశాలలను అధికారులు తనిఖీ చేయాలి'

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు, నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు కనీసం 5 ప్రభుత్వ పాఠశాలలను అధికారులు తనిఖీ చేసి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించాలన్నారు.