హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

NLG: విద్యార్థులు బాగా చదువుకునేందుకు ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం పక్కాగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.