హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు జైలుశిక్ష'

SRPT: మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు జరిమానా, జైలుశిక్ష విధించినట్లు సోమవారం మునగాల ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. ఈ నెల 25న వాహన తనిఖీలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్య పేటకు చెందిన అవినాష్ మద్యం తాగి లారీ నడుపుతూ దొరికాడు. సదరు వ్యక్తికి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉమర్ ఒక్క రోజు జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.