PDPL: జిల్లాలో గంజాయి సాగు సాగు చేసి వ్యక్తులపై కఠిన చర్యలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు తెలిపారు. సోమవారం ఐడిఓసిలో డ్రగ్స్ నిర్మూలనపై జరిగిన సమావేశంలో మాట్లాడారు. పోలీస్, ఎక్సైజ్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు'


