SRCL: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సోమవారం సాయంత్రం రూట్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కాన్వాయ్ మార్గం, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
సీఎం రూట్ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ


