ADB: మావల పీఎస్ పరిధిలోని జాతీయ రహదారి-44 అండర్ బ్రిడ్జి కింద సోమవారం దుండగులు ఒక ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మావల CI ప్రేమ్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. వన్ టౌన్ పీఎస్ పరిధిలో చోరీ అయిన వాహనాన్ని దుండగులు ఇక్కడ తగులబెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
'మావల NH-44 కింద దొంగిలించిన బైక్ దహనం'


