హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ

PDPL: ముత్తారం మండల కేంద్రంలోనిప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా డీఐఈవో సోమవారం తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థుల హాజరు, విద్యా బోధన, మౌలిక వసతులు, అకడమిక్ ప్రగతిని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.