హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గుండెను ఆరోగ్యంగా ఉంచే టమాటా..!

టమాటాలలో 'లైకోపిన్' అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించడంతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. టమాటాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం, సౌందర్యం రెండూ సొంతమవుతాయి. ఎముకల దృఢత్వాన్ని కాపాడే విటమిన్ కె, కాల్షియం ఇందులో లభిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతూ, కంటి చూపు మెరుగుపడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.