హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్ నినో ప్రభావంతో శీతాకాలం ముందే రాబోతోందా?

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆదివారం రాత్రి ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 21 డిగ్రీలకు పడిపోయింది. గత 25 ఏళ్ల కాలంలో సెప్టెంబర్ నెలలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో ఇది రెండోది కావటం విశేషం. దీంతో ఎల్‌నినో వల్ల శీతాకాలం ముందే వచ్చిందా అన్న పలువురు చర్చించుకుంటున్నారు.