హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ

NRPT: మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో సోమవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కనకప్ప, ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, వార్డు సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.