హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్‌ఏలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన

ELR: భీమడోలు మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం వీఆర్‌ఏలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. విఆర్ఓల సమ్మెకు పలువురు మద్దతు ఇచ్చారు.