BPT: చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాలతో నాయకులు బాపట్ల గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. బోయినవారిపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు మాగాణి ప్రాంతంలో వరి సాగుకు నీరు విడుదల చేయాలని కోరారు. దీనివల్ల సమీప ఎత్తిపోతల పథకాల పరిధిలోని 15 వేల ఎకరాలకు నీరందుతుందని పేర్కొన్నారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరి సాగుకు నీరందించాలని వైసీపీ వినతి


