హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోలుకున్న 23 మంది విద్యార్థినులు

KKD: తుని మహిళా జూనియర్ కాలేజీలో బల్లి పడిన సాంబారు తిని అస్వస్థతకు గురైన 23 మంది విద్యార్థినులు తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పటికే 20 మంది విద్యార్థినులను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ముగ్గురి ఆరోగ్యం కూడా మెరుగుపడటంతో సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ తెలిపారు.