హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలపై ధరల భారం తగ్గించాలి: డీబీపీ డిమాండ్

BPT: చీరాల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలానీ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. పేదలపై భారం తగ్గించేలా ధరలను నియంత్రించాలని, పీడీఎస్ ద్వారా నాణ్యమైన బియ్యం సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. సరుకులు అక్రమ నిల్వ చేసే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.