హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణా: మద్యం దుకాణాల లైసెన్స్‌ పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బంటుమిల్లి స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వెంకటేశ్వరమ్మ తెలిపారు. పెడన మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, పెడన రూరల్‌ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు లైసెన్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు అక్టోబర్‌ 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.