GNTR: తెనాలి మారిస్‌పేట రెండు గేట్ల మధ్య ప్రాంతంలో ఆకురాతి శివ(38) సోమవారం మృతి చెందాడు. బాపట్ల జిల్లా ఈపురుపాలెం స్వస్థలంగా తెలిసింది. భార్య, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నట్లు సమాచారం. మద్యానికి బానిసైన శివ ఉదయం మద్యం సేవించిన అనంతరం మురుగు కాలువలో పడి మృతిచెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి


