ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళలు, చిన్నారులపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బహిరంగ ప్రదేశాలు మహిళలకు ప్రమాదకర ప్రాంతాలుగా మారకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఆస్తా కుంజ్ పార్కులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనతో పాటు ఇతర ఘటనలను సుమోటోగా స్వీకరించింది. మహిళలు, చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
వార్తలు
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్


