హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ-కిరండూల్ రైళ్ల రద్దు పొడిగింపు

VSP: వాయుగుండం ప్రభావంతో కొండచరియలు విరిగిపడటంతో కొత్తవలస-కిరండూల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరో రెండు రోజులు అంతరాయం కలగనుంది. మాలిగుడ-ఛట్రిపుట్ మధ్య దెబ్బతిన్న పనులను వేగవంతం చేసినా పూర్తికాకపోవడంతో, సోమ, మంగళవారాల్లో విశాఖ-కిరండూల్, కిరండూల్-విశాఖ (58502/01, 18516/15) పాసింజర్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.