హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాశీపట్నంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ASR: అనంతగిరి మండలం కాశీపట్నం సంత ప్రాంగణంలో ఇవాళ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అనంతగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.