హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు.. నేలకూలిన వరి

PPM: తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు సీతానగరం మండలంలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో పొలాల్లో వరదనీరు నిలిచిపోగా, మరికొన్ని చోట్ల పంట పొలాలు కోతకు గురయ్యాయి. వరి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు ఈదురుగాలులకు నేలకొరిగాయి. ముఖ్యంగా బగ్గందొరవలసలో వరి పొలాలు వరదనీటి ప్రవాహానికి పూర్తిగా దెబ్బతిన్నాయి.