ప్రకాశం: టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఒంగోలు కందుకూరు మార్గాల మధ్య ప్రయాణించే పల్లె వెలుగు బస్సును మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు యూటర్న్ తిరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సుని ఢీకొట్టిన మినీ లారీ


