సోషల్ మీడియాలో వైరల్ అయిన పుకార్లతో పంజాబ్‌లోని రెండు యూనివర్సిటీల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. LPUలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చిట్కారా యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారనే, దయ్యం కారణమనే పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ రెండు ప్రచారాలను పోలీసులు ఖండించారు.
వార్తలు
వైరల్ మెసేజులతో యూనివర్సిటీల్లో హింస


