మాతా అమృతానందమయి 73వ పుట్టినరోజు సందర్భంగా కేరళలోని కొల్లంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమె సేవలను కొనియాడారు. కరుణ, సేవా కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది ప్రజల బాధలను తగ్గించారని ప్రశంసించారు. ‘విశ్వ సేవా దినం’లో భాగంగా ఆరోగ్యం, విద్య, విపత్తు సహాయ రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు భారీగా నిధులు ప్రకటించారు.
వార్తలు
కోట్లాది ప్రజల బాధలు తీర్చారు: అమిత్ షా


