హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ పీజీలో ఉదయశ్రీకి 60వ ర్యాంకు

సత్యసాయి: నీట్ పీజీ జాతీయస్థాయిలో 60వ ర్యాంకు సాధించిన సోమందేపల్లి మండలం మేకలపల్లి గ్రామానికి చెందిన ఉదయశ్రీని పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఘనంగా సన్మానించారు. మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప కుమార్తె అయిన ఉదయశ్రీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.