హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోల దొంగతనం కేసు చేదన

ATP: గార్లదిన్నె మండలంలో గత నెల రోజులుగా జరుగుతున్న వరుస ఆటో దొంగతనాల కేసును పోలీసులు చేదించారు. ఈ కేసును ఎస్సై మహమ్మద్ గౌస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని యజమానులు నాగరాజు, దస్తగిరి, ఆంజనేయులుకు అప్పగించారు.